News May 3, 2024
ఇచ్ఛాపురం: జీడితోటలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లోద్దపుట్టి గ్రామ సమీపంలో జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్.ఐ లక్ష్మణ్ రావు తెలిపారు. అతడు వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. ఈ వ్యక్తి వివరాలు తెలిసిన వారు 63099 90869, 63099 90827 పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Similar News
News November 13, 2024
ఎచ్చెర్ల: ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్
ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.
News November 13, 2024
మాదకద్రవ్య రహిత శ్రీకాకళం జిల్లాగా కృషి చేయాలి: ఎస్పీ
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ విచ్చలవిడిగా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని దీన్ని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
News November 13, 2024
SKLM: 14 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రంధాలయ వారోత్సవాలు
శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 57వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. బుధవారం కలెక్టర్ మందిరంలో గ్రంధాలయ వారోత్సవాలకు జిల్లా గ్రంధాలయ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20 వ తేదీ వరకు జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని కలెక్టర్‌కు వివరించారు.