News July 21, 2024
ఇచ్ఛాపురం: డెంగ్యూ జ్వరంతో బీటెక్ విద్యార్థి మృతి

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం దానంపేటకు చెందిన తిప్పన విగ్నేష్ (21) డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. ఇటీవల డెంగ్యూ జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరిన విగ్నేష్ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీ సైనిక్ ఉద్యోగికి రమణారెడ్డికి ఒక్క కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు ప్రస్తుతం బీటెక్ చదువుతున్నాడు.
Similar News
News October 14, 2025
ఎచ్చెర్ల: ‘పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 42 శాతం ప్రవేశాలు’

రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలకు నిర్వహించిన ఏపీ పీజీ సెట్ -2025 రెండో విడత కౌన్సిలింగ్ అలాట్మెంట్లను కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యాలయంలో 19 పీజీ కోర్సుల్లో 600 సీట్లు ఉండగా 253 ప్రవేశాలు జరిగాయన్నారు. 42% ప్రవేశాలు మాత్రమే జరిగాయి. కనీసం పీజీ కోర్సులో 50% ప్రవేశాలు జరగకపోవటం గమనార్హం. కొన్ని కోర్సుల్లో కనీస ప్రవేశాలు జరగలేదు.
News October 14, 2025
పొందూరు: కరెంట్ షాక్తో ఎలక్ట్రిషీయన్ మృతి

కరెంట్ షాక్తో ఓ ఎలక్ట్రీషియన్ మృతిచెందిన ఘటన పొందూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు మేరకు.. మండలంలోని పుల్లాజీపేట గ్రామానికి చెందిన ఉమామహేశ్వరరావు (39) ఎలక్ట్రిషీయన్గా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ఇంట్లో ఎలక్ట్రానిక్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.
News October 14, 2025
రైతుల ఖాతాల్లోకి 5,6 గంటల్లో దాన్యం కొనుగోలు డబ్బులు: మంత్రి మనోహర్

రైతులు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 5,6 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమవుతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సోమవారం జడ్పీ సమావేశ మందిరంలో వివిధ రైతు సంఘాలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గతంలో 48 గంటలు పట్టేదని అటువంటి ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరళతరం చేస్తారన్నారు. దీనికి సంబంధించి సమస్యలను రైస్ మిల్లర్లకు అడిగి తెలుసుకున్నారు.