News March 6, 2025
ఇచ్ఛాపురం: మద్యం దుకాణాలకు ఎంపిక నేడు

ఇచ్చాపురం ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల మద్యం దుకాణాలకు అభ్యర్థులను గురువారం రోజున లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సీఐ దుర్గాప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా.. జిల్లా కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డు అంబేడ్కర్ ఆడిటోరియంలో ఉ.8 గం.లకు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న వారు ఎంట్రీపాస్, ఆధార్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ తేవాలన్నారు.
Similar News
News March 18, 2025
ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.
News March 18, 2025
టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.
News March 18, 2025
కోటబొమ్మాళి: బంధువులకు విద్యార్థి అప్పగింత

కోటబొమ్మాళి మండలంలోని జగనన్న కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం పరారైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌లో బాలుడి ఆచూకీ దొరికింది. వాట్సాప్ పోస్టుల ద్వారా ఓ వ్యాపారి బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం విద్యార్థి పిన్ని వచ్చి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు.