News June 12, 2024
ఇచ్ఛాపురం: రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. ఇచ్ఛాపురం దాసన్నపేట మెయిన్ రోడ్డులో నివాసం ఉన్న కస్పా రాజేష్ (32) హైదరాబాదులో ఒక ప్రైవేట్ జిమ్‌లో శిక్షకుడిగా పని చేస్తున్నారు. కుటుంబ సమేతంగా సింహాచలం దర్శనానికి ఇచ్ఛాపురం వస్తుండగా శ్రీకాకుళం పరిసరాలలో రైలు నుంచి జారి పడిన్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతునికి భార్య పద్మ, ఒక కుమారుడు ఉన్నారు.
Similar News
News March 21, 2025
నందిగాం: జీడి చెట్టుకి ఉరేసుకుని వ్యక్తి మృతి

నందిగామ మండలం హరిదాసు పురం గ్రామానికి చెందిన అక్కురాడ డిల్లేశ్వరరావు శుక్రవారం జీడి తోటలో ఉరేసుకుని చనిపోయాడు . జీడి పిక్కలు కోయడానికి వెళ్లిన తన తమ్ముడు చూసి, పోలీసులకు సమాచారం తెలిపాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు . దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2025
గార: నదిలో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మృత దేహం

గార మండలం కళింగపట్నం సమీపంలో వంశధార నదిలో శుక్రవారం ఓ గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగ మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2025
ఇచ్ఛాపురంలో లారీ దొంగతనం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనలకు గురౌతున్నారు. ఇటీవల కాలంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలలో బంగారం, ద్విచక్ర వాహనాలు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం రోజున రాత్రి ఇచ్ఛాపురం మండల కేంద్రంలో నిలిపి ఉన్న లారీని ఎవరో దొంగలించినట్లు లారీ డ్రైవర్ తెలిపారు.