News February 17, 2025

ఇచ్ఛాపురం: శుభకార్యానికి వెళ్లొస్తూ వ్యక్తి మృతి

image

ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి ఆదివారం  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు వివరాల మేరకు.. ధర్మపురం గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ట్రాక్టర్‌ను తప్పించబోయి బైక్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.

Similar News

News April 17, 2026

ఎచ్చెర్ల: చేపల వేటకు బ్రేక్.. తీరాల్లో నిశ్శబ్దం!

image

చేపల వేటపై రెండు నెలల నిషేధం అమల్లోకి రావడంతో జిల్లాలోని సముద్ర తీరాలు నిర్మానుష్యంగా మారాయి. ఎచెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామంలో మత్స్యకారులు బోట్లను, వలలను ఒడ్డున సురక్షితంగా ఉంచి ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి ఏడాది చేపల ప్రత్యుత్పత్తి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిషేధాన్ని అమలు చేస్తోంది. ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

News April 17, 2026

శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

image

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్‌, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.