News November 1, 2024

ఇచ్ఛాపురం: సీఎం సభలో జిల్లా కూటమి నేతల సందడి

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఈదుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు సీఎం సభకు హాజరయ్యారు.

Similar News

News November 1, 2025

మీ మూలధనం, మీ హక్కు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఇన్‌ఛార్జి కలెక్టర్

image

భారత ప్రభుత్వం ఆర్థిక సేవలు విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్-డిసెంబర్ 2025 త్రైమాసికానికి మీ మూలధనం, మీ హక్కుఅనే ప్రత్యేక ప్రచార వాల్ పోస్టర్‌ను జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో DRO వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, లీడ్ బ్యాంకుల మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News October 31, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ హెడ్ లైన్స్

image

★ పల్లెల అభివృద్దే కూటమి లక్ష్యం: ఎమ్మెల్యే కూన
★సారవకోట: దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్
★ పంట నష్టాన్ని పరిశీలించిన ఎమ్మెల్యేలు అశోక్, శంకర్
★ కోటబొమ్మాళిలో చెట్టుకు ఉరివేసుకుని ఒకరు సూసైడ్
★ లావేరులో అగ్నిప్రమాదం..మూడు పూరిళ్లు దగ్ధం
★ పాతపట్నం: రాళ్లు తేలిన ఆల్ ఆంధ్రా రోడ్డు
★ జిల్లాలో పలుచోట్ల పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీలు

News October 31, 2025

‘ఉద్యోగంలో చేరేందుకు..ఆ టీచర్‌కు 10 రోజులే డెడ్ లైన్’

image

పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌ (జీవ శాస్త్రం) అంగూరు చంద్రరావు 2022 నుంచి విధులకు గైర్హజరయ్యారు. దీనిపై పలు మార్లు హెచ్‌ఎంకు డీఈవో నోటీసులిచ్చినా వివరణ ఇవ్వలేదు. ఈ ఏడాది MAR’3వ తేదీన ఇచ్చిన చివరి నోటీసుకు ఉద్యోగి ఎటువంటి స్పష్టత ఇవ్వకపోగా నేటి వరకు విధుల్లో చేరలేదు. 10 రోజుల గడువులో హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని డీఈవో రవిబాబు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.