News November 1, 2024
ఇచ్ఛాపురం: సీఎం సభలో జిల్లా కూటమి నేతల సందడి
ఇచ్ఛాపురం నియోజకవర్గ పరిధిలోని ఈదుపురం గ్రామంలో శుక్రవారం జరిగిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కూటమి నేతలు సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్‌తో పాటు ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, ఎన్.ఈశ్వరరావు, జనసేన, బీజేపీ నాయకులు సీఎం సభకు హాజరయ్యారు.
Similar News
News December 9, 2024
వీరఘట్టం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వీరఘట్టం మండలం వండువ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరఘట్టంకు చెందిన కూర్మాన అశోక్ చక్రవర్తి (35) అనే వ్యక్తి మృతి చెందాడు. కొంతకాలంగా పాలకొండలో నివాసం ఉంటున్న అతడు ఆదివారం వీరఘట్టం వచ్చి తిరిగి పాలకొండ వెళుతుండగా మార్గ మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటనపై ఎస్సై కళాధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 8, 2024
SKLM: రైల్వే అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులపై విశాఖపట్నంలో ఆదివారం డివిజన్ సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమృత భారత్‌లో భాగంగా శ్రీకాకుళం నౌపాడ స్టేషన్ల అభివృద్ధి చేయాలని, నౌపాడ -గుణుపూర్ లైన్ క్రాసింగ్ స్టేషన్ నిర్మాణం, టెక్కలి పాతపట్నం స్టేషన్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. పొందూరు – పలాస మధ్య జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు.
News December 8, 2024
నందిగాం: కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం సుభద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అటుగా భారీ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.