News January 9, 2025
ఇచ్ఛాపురం స్వల్ప భూ ప్రకంపనలు

శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
Similar News
News November 28, 2025
శ్రీకాకుళం: ‘ప్రతి శివారు భూమికి నీరు ఇవ్వాల్సిందే’

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పాత, కొత్త సాగునీటి ప్రాజెక్టుల పనులను అత్యంత త్వరిత గతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయకట్టులోని చివరి భూమి వరకూ నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ప్రాజెక్టుల పూర్తికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
News November 28, 2025
SKLM: ఏడు రోజుల మహోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టరేట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలన్నారు.
News November 28, 2025
శ్రీకాకుళం: ‘రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి’

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఏపీ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అన్నారు. శాసన సభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27,28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.


