News January 9, 2025
ఇచ్ఛాపురం స్వల్ప భూ ప్రకంపనలు
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్ఛాపురం మండలంలో బుధవారం రాత్రి 10:56 గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున 4:55 గంటల సమయంలో మరోసారి స్వల్ప ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
Similar News
News January 13, 2025
పాలకొండ: మాజీ రాజ్యసభ సభ్యుడు రాజశేఖరం మృతి
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తండ్రి పాలవలస రాజశేఖరం ఇటీవల అనారోగ్యంతో శ్రీకాకుళంలోని జేమ్స్ హాస్పిటల్ చేరారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 8 గంటలు తర్వాత తుదిశ్వాస విడిచారు. గతంలో రాజశేఖరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, MLA, రాజ్యసభలో ఎంపీగా సేవలు అందించారు. 1970లో వీరఘట్టంలోని నీలానగరం సర్పంచ్‌గా గెలవడంతో రాజకీయం ప్రస్థానం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.
News January 13, 2025
శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
టెక్కలి మండలం కె కొత్తూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. టెక్కలి మండలం పెద్దసాన గ్రామానికి చెందిన బందాపు అప్పారావు గ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొంది. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో ఉన్న ఆయనను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
News January 13, 2025
శ్రీకాకుళం: ఈ గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర
సంక్రాంతి అనగా మనకు గ్రామాలు గుర్తుకు వస్తాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలోని S.Mపురం గ్రామానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం రాజులకు ఫౌజదారిగా వ్యవహరించిన షేర్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ గ్రామానికి వచ్చింది. ఇతను క్రీ.శ 1600 సం. కాలంలో గ్రామంలో కోట, ఏనుగుల ద్వారం, పెద్ద చెరువు, తాగునీటి కోసం 7 బావులను సైతం ఏర్పాటు చేశారు. నేడు అవి శిథిలావస్థలో ఉన్నాయని, వాటిని సంరక్షించాలని స్థానికులు అన్నారు.