News November 30, 2024

ఇజ్రాయెల్ సహకారంపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం

image

ఇజ్రాయిల్ రాయబారితో మంథని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు. మూసీ నది ప్రాజెక్టు పునరుద్ధరణలో సాంకేతిక నైపుణ్యాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఇజ్రాయెల్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి అన్నారు. AI, సైబర్‌ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని శ్రీధర్‌బాబు రిక్వెస్ట్ చేశారు.

Similar News

News December 10, 2025

జమ్మికుంట: స్వల్పంగా తగ్గిన పత్తి ధర

image

జమ్మికుంట మార్కెట్లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,450 పలకగా.. బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్‌కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.

News December 10, 2025

కరీంనగర్: జీపీ ఎన్నికలు.. పంపిణీ కేంద్రాలివే

image

గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాలను కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు. చొప్పదండి- ZPHS బాయ్స్, గంగాధర- ZPHS, రామడుగు ZPHS, కొత్తపల్లి ఎలగందల్ ZPHS, కరీంనగర్ గ్రామీణం- ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News December 10, 2025

కార్మికుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్ పమేలా సత్పతి

image

కరీంనగర్ జిల్లా పారిశుద్ధ్య కార్మికులు, మల్టీపర్పస్ వర్కర్లకు ఉచిత దంత వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్ణయించారు. కరీంనగర్ కళా భారతిలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి ఆమె పరిశీలించారు. దంత సమస్యలున్న వారికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తదుపరి చికిత్స ఉచితంగా లభిస్తుందని తెలిపారు.