News March 18, 2025

ఇటలీలో సిరిసిల్ల జిల్లా వ్యక్తి మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి ఇటలీలో రోడ్డు ప్రమాదంలో 15 రోజుల క్రితం మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేటకు చెందిన మహమ్మద్ రషీద్ (47) ఇటలీలో లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో వేరే వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహం రెండు రోజుల్లో స్వగ్రామం రానుంది.

Similar News

News December 3, 2025

పశ్చిమలో ‘కొబ్బరి’కి కొత్త కళ..

image

ప.గో జిల్లాలోని కొబ్బరి రైతులు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం భారీ ఊతమిచ్చింది. కొబ్బరి క్లస్టర్‌ పరిధిలో రూ.29.97 కోట్ల అంచనాతో చేపట్టనున్న అత్యాధునిక ‘కామన్ ఫెసిలిటీ సెంటర్’ పనులను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వాటా రూ.4.49 కోట్లలో.. తొలివిడతగా రూ.2.24 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కేంద్రం ద్వారా కొబ్బరి, బంగారం ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలు సాధించేందుకు మార్గం సుగమమైంది.

News December 3, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు చార్టెడ్ ఫ్లైట్లలో ప్రముఖులు

image

గ్లోబల్ సమ్మిట్‌కు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథుల కోసం ఏకంగా 3 హెలిప్యాడ్‌లు సిద్ధం చేశారు. 50 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ హెలిప్యాడ్‌ల ద్వారా సుమారు 500 మంది ప్రముఖ అతిథులను రిసీవ్ చేసుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఈవోలు, సినీ తారలు సహా పలువురు ప్రముఖులు చార్టెడ్ ఫ్లైట్లలో ఇక్కడికి చేరుకుంటారని అధికారులు Way2Newsకు తెలిపారు.