News March 25, 2025

ఇటిక్యాల: ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

image

ఇటిక్యాల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు ఈరోజు పనులను తనిఖీ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని జాబ్ కార్డు ఉన్న ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఇటిక్యాల ఎంపీడీవో, ఎర్రవల్లి ఎంపీడీవో, ఇతర ఉన్నతాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేశ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

భూపాలపల్లి: కాంగ్రెస్ సారథికి సవాల్!

image

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌కు పంచాయతీ ఎన్నికలు సవాలుగా మారనున్నాయి. జిల్లా కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లుకలుకల నేపథ్యంలో, అన్ని వర్గాలను కలుపుకుపోవడం ఆయనకు కత్తిమీద సాములా మారింది. సీనియర్ నాయకులతో సమన్వయం సాధించడంపైనే ఆయన దృష్టి సారించాల్సి ఉంటుంది.

News December 2, 2025

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

image

ఏయూలో స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామినేష‌న్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేష‌న్‌‌ విడుద‌ల చేశారు. 2010-11 సంవ‌త్స‌రం నుంచి 2025 వ‌ర‌కు డిగ్రీ, పీజీ ప్ర‌వేశం పొందిన విద్యార్థులు స్పెష‌ల్ డ్రైవ్ ప‌రీక్ష‌ల‌కు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబ‌ర్ 4 నుంచి 26వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఫిబ్ర‌వ‌రి 20వ తేదీ నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు.

News December 2, 2025

HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

image

హైదరాబాద్‌లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్‌బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్‌ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.