News August 21, 2024

ఇటిక్యాల: పాము కాటుకు బాలుడు మృతి

image

పాము కాటుకు బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం ఇటిక్యాల మండలం గోపాలదిన్నెలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేణుగోపాల్ (9) మంగళవారం రాత్రి పడుకున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం గద్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, డాక్టర్ల సలహాతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

Similar News

News September 12, 2024

PDSU 50ఏళ్ల స్వర్ణోత్సవ సభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఈనెల 24న నిర్వహించే PDSU 50ఏళ్ల లోగో, స్వర్ణోత్సవ సభ పోస్టర్ ను PDSU మాజీ నేతలు బి.రాము, కాలేశ్వర్ ఆవిష్కరించారు. 1974లో PDSU ఏర్పడిన నాటి నుంచి 2024 వరకు మొక్కవోని దీక్షతో, విద్యారంగ సమస్యల పరిష్కారానికై తన వంతు కృషి చేసిందని వారు తెలిపారు. ఈ సమావేశంలో కాలేశ్వర్, దేవేందర్, అరుణ్, అంబదాస్, సాంబశివుడు, సాయి, మారుతి, సీతారాం, అజయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

News September 11, 2024

దేవరకద్ర: పొదల్లో నవజాత శిశువు లభ్యం

image

దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ స్టేజి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. దేవరకద్ర PACS ఛైర్మన్ నరేందర్ రెడ్డి గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినపడగా పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూశారు. చీమలు పట్టి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి SI నాగన్న, అంగన్‌వాడీ టీచర్ చేరుకుని నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News September 11, 2024

రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించిన పాలమూరు వాసి

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ డిప్లొమా అర్హత పరీక్షలో మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం దేశాయిపల్లికి చెందిన డి.వేణు 92 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రులు సరోజ,పెంటయ్య స్వగ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించడం పట్ల గ్రామస్థులు,మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.