News October 31, 2024
ఇటువంటి ఘటన దురదృష్టకరం: కలెక్టర్

ఉండ్రాజవరం మండలం సూర్యరావుపాలెం గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పండుగ సమయంలో ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Similar News
News December 1, 2025
మాక్ అసెంబ్లీలో పాల్గొన్న విద్యార్థులు సత్కరించిన కలెక్టర్

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ భీమవరం కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపిన విద్యార్థులు భవిష్యత్తులో నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
News December 1, 2025
జిల్లాలో రోడ్లు అభివృద్ధికి రూ.37.70 కోట్లు నిధులు: కలెక్టర్

ప.గో. జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి, కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.37.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. రాష్ట్ర రహదారులు, జిల్లాలోని ప్రధాన రహదారులు అభివృద్ధికి ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆమె సోమవారం తెలిపారు. ఉండి నియోజకవర్గంలో కోపల్లె బ్రిడ్జి నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ఆమె వెల్లడించారు.
News December 1, 2025
ప.గో.: పోలీస్ శాఖ PGRSకు 13 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 13 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి, సమస్యల పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకుంటామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.


