News January 31, 2025
ఇట్యాలలో 8కుటుంబాల కులబహిష్కరణ

మనిషి ఆధునిక ప్రపంచం వైపు ప్రయాణిస్తున్న ఆచార వ్యవహారాలు కాలం చెల్లిన కట్టుబాట్లను మాత్రం వదలడం లేదు. బాధితుల కథనం ప్రకారం.. దహేగాం మండలం ఇట్యాలలో 8 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయని బాధితులు వాపోయారు. ఇద్దరి మధ్య గొడవలో పెద్దమనుషులు ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారన్నారు. వారితో మాట్లాడినందుకు 8 కుటుంబాలను బహిష్కరించారన్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వారు వేడుకున్నారు.
Similar News
News September 18, 2025
iOS 26పై యూజర్ల నుంచి భిన్నాభిప్రాయాలు

ఐఫోన్ 11, ఆ తర్వాతి మోడల్స్‌కి iOS 26 స్టాండర్డ్ వర్షన్ అందుబాటులోకి వచ్చింది. కొందరు లిక్విడ్ గ్లాస్ న్యూ డిజైన్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, లాక్ స్క్రీన్, హోం స్క్రీన్ ఎక్స్పీరియన్స్ బాగున్నాయంటున్నారు. మరికొందరు ‘బ్యాటరీ వెంటనే డ్రెయిన్ అవుతోంది, ఫోన్ వేడెక్కుతోంది’ అని ఫిర్యాదు చేస్తున్నారు. మేజర్ అప్డేట్ ఇలాంటివి సహజమేనని త్వరలోనే అంతా సర్దుకుంటుందని యాపిల్ కంపెనీ చెబుతోంది.
News September 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు జేఎంజే విద్యార్థులు

మెదక్ జిల్లా మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ మహేశ్, కార్యదర్శి రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News September 18, 2025
పాక్-సౌదీ మధ్య ఉమ్మడి రక్షణ ఒప్పందం

పాకిస్థాన్-సౌదీ అరేబియా దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు వ్యూహాత్మక ఉమ్మడి రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏ ఒక్క దేశంపై దురాక్రమణ జరిగినా దానిని ఇరు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కార్యాలయం చెప్పినట్లు డాన్ న్యూస్ పేపర్ పేర్కొంది. డిఫెన్స్ సపోర్ట్‌ను మెరుగు పరచుకోవడానికి ఈ ఒప్పందం దోహద పడుతుందని ఆ దేశాలు ఆకాంక్షించాయి.