News January 31, 2025

ఇట్యాలలో 8కుటుంబాల కులబహిష్కరణ

image

మనిషి ఆధునిక ప్రపంచం వైపు ప్రయాణిస్తున్న ఆచార వ్యవహారాలు కాలం చెల్లిన కట్టుబాట్లను మాత్రం వదలడం లేదు. బాధితుల కథనం ప్రకారం.. దహేగాం మండలం ఇట్యాలలో 8 కుటుంబాలు కుల బహిష్కరణకు గురయ్యాయని బాధితులు వాపోయారు. ఇద్దరి మధ్య గొడవలో పెద్దమనుషులు ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారన్నారు. వారితో మాట్లాడినందుకు 8 కుటుంబాలను బహిష్కరించారన్నారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వారు వేడుకున్నారు.

Similar News

News February 19, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.6,810

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు సైతం పత్తి ధర అన్నదాతకు నిరాశే మిగిల్చింది. సోమవారం, మంగళవారం రూ.6,800 పలికిన క్వింటా పత్తి ధర.. ఈరోజు రూ.10 పెరిగి, రూ.6,810కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారాలు చెబుతున్నారు. 

News February 19, 2025

సీబీఎస్ఈ కీలక నిర్ణయం

image

సీబీఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్స్ తరహాలో ఏడాదిలో రెండు సార్లు పరీక్ష నిర్వహణను వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈ నెల 24న ముసాయిదాను విడుదల చేయనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. దీంతో విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉందని తెలిపింది.

News February 19, 2025

వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!