News August 7, 2024
ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య

వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఉన్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థిని జమీషా ఖురేషి (17)అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి క్యాంపస్‌లోని బ్రాత్ రూంలో తన చున్నీతో ఉరి వేసుకొన్న సంఘటనను విద్యార్థులు, సిబ్బంది గమనించి అధికారులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 10, 2026
ప్రొద్దుటూరులో నేడు బంగారం, వెండి ధరలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
*24 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.15,280
*22 క్యారెట్ బంగారం 1 గ్రాము ధర రూ.14,058
*వెండి 10 గ్రాముల ధర రూ.2,460
News April 10, 2026
కడప: యువతి గొంతు కోసి హత్య

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News April 10, 2026
పులివెందుల యువతి గ్రేట్..!

పులివెందుల పట్టణానికి చెందిన అనిలాదేవి, గురుదత్తల కుమార్తె సాయి వర్షిత తాజాగా విడుదలైన SSC CGL ఫలితాల్లో సత్తాచాటారు. ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆమె గతేడాది ఐదు సెంట్రల్ జాబ్స్ సాధించి ఔరా అనిపించారు. న్యాయ శాస్త్రం చదివిన ఐదేళ్లలో నాలుగు బంగారు పతకాలు సాధించడం విశేషం. ఆమెను పలువురు అభినందించారు.


