News August 5, 2024

ఇడుపులపాయ ఆర్కేవ్యాలీలో ఫైథాన్ వర్క్ షాప్

image

ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో ఫైథాన్ స్టాక్ డెవలప్‌మెంట్ వర్క్ షాప్ నిర్వహించినట్లు డైరెక్టర్ కుమారస్వామి గుప్తా తెలిపారు. ఆదివారం ట్రిపుల్ ఐటీ సిఎస్ఇ విభాగంలో రిసోర్స్ పర్సన్ సంతోశ్ ఉద్యోగ ఎంపికకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇంటర్వ్యూలకు హాజరైన విద్యార్థులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 25, 2026

కడప జిల్లాలో పలువురు SDCలకు పోస్టింగ్.!

image

జిల్లాలో పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. కడప TGP SDCగా శివరాముడు, KRRC SDCగా నాగరాజు, డిజాస్టర్ మేనేజ్మెంట్ DPMగా హరి ప్రసాద్, ముద్దనూరు GNSS SDCగా వెంకటేశ్వర్లు, రాజంపేట సోమశిల ప్రాజెక్టు SDCగా శివరామిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. వీరిలో కొందరికి పదోన్నతులు కల్పించి పోస్టింగ్ ఇచ్చారు.

News February 24, 2026

కడప: ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు: హరిత

image

ఆహార కల్తీపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోల్ అధికారి హరిత హెచ్చరించారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనతో మంగళవారం జిల్లాలో తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. దాడులు కొనసాగుతాయన్నారు. పాల కేంద్రాలు, హోటళ్లు, టీ స్టాళ్లలో పాల శాంపిల్స్ సేకరించామన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని హలీం తయారీలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆహార తయారీలో టేస్టింగ్ సాల్ట్, కలర్స్ వాడకూడదన్నారు.

News February 24, 2026

కడప: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష.. 382 మంది గైర్హాజరు

image

ఇవాళ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 97 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మంగళవారం జిల్లాలో 62 కేంద్రాల్లో 15,159 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా.. 14,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. 382 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 14,011 మంది జనరల్ విద్యార్థుల్లో 13,691 మంది హాజరవ్వగా.. 320 మంది గైర్హాజరయ్యారు. 1,148 మంది ఒకేషనల్ విద్యార్థుల్లో 1,086 మంది హాజరవ్వగా.. 62 మంది పరీక్షలు రాయలేదు.