News December 11, 2024

ఇడుపులపాయ IIITలో ఫుడ్ పాయిజన్.. 30 మందికి అస్వస్థత

image

ఇడుపులపాయ IIIT ఓల్డ్ క్యాంపస్‌లో మంగళవారం మధ్యాహ్నం ఫుడ్ పాయిజన్‌‌తో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్యాంపస్‌లో ఇడుపులపాయ, ఒంగోలు IIITలకు చెందిన విద్యార్థులు ఉంటున్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది వారికి IIIT ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొందరికి 4 రోజులుగా ఆరోగ్యం బాలేదని, ప్రస్తుతం విద్యార్థులకు ప్రమాదం లేదని డైరెక్టర్ కుమారస్వామి గుప్తా అన్నారు.

Similar News

News January 25, 2025

కడప జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ అశోక్

image

కడప జిల్లా నూతన ఎస్పీ అశోక్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్‌ను శుక్రవారం కలిశారు. నూతన ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కడప కలెక్టర్ శ్రీధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కలెక్టర్‌ను అడిగి ఆరా తీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

News January 25, 2025

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: ఎంపీ

image

రాష్ట్రంలో విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలుకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సూచించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పసుపులేటి సాయిదత్త ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్‌ను ఆయన కడప కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు సీఎం ఇచ్చిన హామీలు అమలు కోసం పోరాటం చేయాలని సూచించారు.

News January 24, 2025

పులివెందులకు ఉప ఎన్నికలు ఖాయం: బీటెక్ రవి

image

వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం చూస్తుంటే, పులివెందులకు ఉప ఎన్నికలు రావడం ఖాయంగా కనపడుతోందని పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. రాజకీయాలకు విజయ్ సాయిరెడ్డి రాజీనామా చేశారంటే అప్రూవర్‌గా మారడం ఖాయమన్నారు. ఇక జగన్ డిస్ క్వాలిఫై అవుతారని, పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయమంటూ ట్వీట్ చేశారు.