News November 27, 2024

ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం ఆగిపోయేవరకు పోరాడుతా: ఏలేటి

image

ఇథనాల్‌ పరిశ్రమ తరలింపుపై పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యపై గుండంపల్లి రైతులందరితో చర్చించి న్యాయపోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. దిలావర్‌పూర్‌ ప్రజలకు అండగా నిలబడతానని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలీస్‌ అధికారులు రైతులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని కోరారు.

Similar News

News February 12, 2026

ఆదిలాబాద్: కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు లోబడి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆదిలాబాద్‌ టీటీడీసీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని గురువారం ఆయన ఎన్నికల సాధారణ పరిశీలకుడు హనుమంత్ నాయక్‌తో కలిసి పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లు, భద్రతా ఏర్పాట్లు, బారికేడింగ్, వెలుతురు తదితర సదుపాయాలను స్వయంగా తనిఖీ చేసి సూచనలు చేశారు.

News February 12, 2026

ఆదిలాబాద్ పీఠాన్ని హ‌స్త‌ గ‌తం చేసుకుంటాం: డీసీసీ అధ్యక్షుడు

image

ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని త‌ప్ప‌కుండా కైవ‌సం చేసుకుంటామ‌ని కాంగ్రెస్ జిల్లా అధ్య‌క్షుడు న‌రేష్ జాద‌వ్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్య‌ర్థులతో గురువారం ప‌ట్ట‌ణంలోని ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్ హాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జ్ కంది శ్రీ‌నివాస రెడ్డితో కలిసి స‌మావేశం నిర్వ‌హించారు. వార్డుల వారీగా ఓటింగ్ జ‌రిగిన తీరు గురించి చ‌ర్చించారు. అనంతరం క్యాంప్‌నకు తరలించారు.

News February 12, 2026

ఆదిలాబాద్: రేపు ఈ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

image

ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే విధంగా సహకరించాలని, కౌంటింగ్ సందర్భంగా ‘ఐ లవ్ ఆదిలాబాద్ నుంచి మావల పోలీస్ స్టేషన్ వరకు’ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రేపు ఉదయం నుంచి ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ప్రజలు పట్టణంలోని అంతర్గత రోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.