News August 27, 2024

ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికార నిర్లక్ష్యమా?: కేటీఆర్

image

కాక‌తీయ కళా‌తో‌రణం చార్మినార్‌ లేని రాజ‌ము‌ద్రతో గ్రేటర్‌ వరం‌గల్‌ కార్పొ‌రే‌షన్‌ ప్రధాన కార్యా‌లయం ఎదుట అధి‌కా‌రులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సిరిసిల్ల MLA కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కొత్త చిహ్నం ఎవరు, ఎప్పుడు ఆమోదించారు? ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో తెలుసుకొని వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్‌లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్‌లో 8.14% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

image

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్‌గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్‌గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.

News December 17, 2025

మూడోదశ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

కరీంనగర్ జిల్లాలో మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, వి.సైదాపూర్ మండలాల్లోని పోలింగ్, లెక్కింపు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రతా చర్యలను పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా, CCటీవీ పర్యవేక్షణ, ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు.