News June 3, 2024
ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం : కేటీఆర్
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని పాతబస్తీ <<13368558>>హిందూపూర్ వాటర్ ట్యాంక్‌లో <<>>మృతదేహం లభించిన ఘటనపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ట్విటర్ (ఎక్స్) వేదికగా నిప్పులు చెరిగారు. ఇది ప్రజా పాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని విమర్శించారు.
Similar News
News September 12, 2024
నాగర్జునసాగర్‌కు తగ్గిన వరద
నాగార్జునసాగర్ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టడంతో క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 71,001 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 43,334 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.70 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.1486 టీఎంసీల నీరు ఉన్నట్లు తెలిపారు.
News September 12, 2024
త్రిబుల్ ఆర్ భూ బాధితులకు ఊరట
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం భూములు కోల్పోనున్న రైతులకు కొంత ఊరట లభించే విధంగా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రింగ్ రోడ్డు కోసం సేకరించే భూముల విలువను పెంచే ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ పరిధిలోని భూముల రిజిస్ట్రేషన్ విలువ 60 శాతం నుంచి 120 శాతం వరకూ పెంచేందుకు ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేసి నేషనల్ హైవే అథారిటీకి పంపారు.
News September 12, 2024
బీబీనగర్ – గుంటూరు లైన్ డబ్లింగ్ పనులు ప్రారంభం
రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఉన్న సికింద్రాబాద్ – గుంటూరు రైలుమార్గంలో మొదటి దశ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. బీబీనగర్ నుంచి గుంటూరు జిల్లా నల్లపాడు జంక్షన్ వరకు 243 కిలోమీటర్ల మేర సింగిల్ రైల్వే లైన్ ఉండడంతో రైలు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో రెండో రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే రైలు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి.