News February 4, 2025
ఇది ప్రజాస్వామ్య ఓటమి: రోజా

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి.. ప్రజాస్వామ్య ఓటమి అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ‘తిరుపతి మేయర్ డా.శిరీషని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం’ అని రోజా X వేదికగా ప్రశ్నించారు.
Similar News
News October 15, 2025
కూకట్‌పల్లిలో 9 మంది మహిళల బైండోవర్

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్రో స్టేషన్ సమీపంలోని భాగ్యనగర్ కాలనీ వద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 9 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కూకట్‌పల్లి ఎంఆర్‌ఓ ఎదుట హాజరుపరిచి, మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేసినట్లు సీఐ కేవీ సుబ్బారావు, ఎస్సై నర్సింహ తెలిపారు. రోడ్డుపైన వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 15, 2025
టీనేజర్ల కోసం ఇన్‌స్టాలో కొత్త రూల్స్!

ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల భద్రత కోసం మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సినిమాల తరహాలోనే PG-13 రేటింగ్ మార్గదర్శకాల ఆధారంగా టీనేజ్ యూజర్లకు కంటెంట్‌పై రెస్ట్రిక్షన్స్ విధించనుంది. ఆటోమేటిక్‌గా 18 ఏళ్లలోపు యూజర్లను 13+ కేటగిరీ సెట్టింగ్‌లో ఉంచనున్నట్లు తెలిపింది. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా పిల్లలు దానిని ఛేంజ్ చేయలేరు. డ్రగ్స్ వాడకం, అడల్ట్, హింసాత్మక కంటెంట్‌లను వారికి చూపించదు.
News October 15, 2025
శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ రాజ్యం

శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం చూడాల్సిన చారిత్రక ప్రదేశం ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. శివాజీ రాజసాన్ని ప్రతిబింబించేలా భారీ బురుజులు, మధ్యలో కోట.. అందులో భారీ విగ్రహం వంటివి ఎన్నో ఉన్నాయి. శివాజీ 1677లో శ్రీశైలం పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, ఆలయానికి ఉత్తరం వైపున ధ్యానం చేయడంతో ఆ ప్రదేశంలోనే ధ్యాన మందిరం నిర్మించారు. ఈ స్ఫూర్తి మందిరాన్ని ఈనెల 16న ప్రధాని మోదీ సందర్శించనున్నారు.