News February 4, 2025

ఇది ప్రజాస్వామ్య ఓటమి: రోజా

image

తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓటమి.. ప్రజాస్వామ్య ఓటమి అని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. ‘తిరుపతి మేయర్ డా.శిరీషని విధుల నిర్వహణలో అవమానించారు. కార్పొరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం’ అని రోజా X వేదికగా ప్రశ్నించారు.

Similar News

News February 9, 2026

ఆకాశంలో టాక్సీలు.. బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్: CII ప్రతిపాదన

image

గురుగ్రామ్, నోయిడా ఎయిర్‌పోర్ట్ మధ్య ‘ఎయిర్ టాక్సీలు’ నడపాలని CII ప్రతిపాదించింది. గంటల ప్రయాణం నిమిషాల్లోనే ముగిసేలా ఆఫీసులు, హాస్పిటల్స్, కమర్షియల్ బిల్డింగ్‌లపైనే ల్యాండింగ్ ప్యాడ్లు ఏర్పాటు చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో ఆర్గాన్ ట్రాన్స్‌పోర్ట్ కోసం వీటిని వాడతారట. మెట్రో స్టేషన్లు, బిజినెస్ హబ్‌లను కలుపుతూ ఈ నెట్‌వర్క్ రాబోతోంది.

News February 9, 2026

ఖమ్మం జిల్లాలో కుష్టు నిర్మూలనకు ముమ్మర సర్వే

image

ఖమ్మం జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు వైద్యశాఖ రెండో విడత ఇంటింటి సర్వే చేపట్టింది. ఈ నెల 13 వరకు ఆశా కార్యకర్తలు అనుమానితులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తారు. ఈ ఏడాది కొత్తగా 74 కేసులు నమోదయ్యాయి. శరీరముపై స్పర్శ లేని మచ్చలుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో సంప్రదించాలని, క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధి పూర్తిగా నయమవుతుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రామారావు తెలిపారు

News February 9, 2026

రిజర్వేషన్ల లెక్కలతో పల్లెల్లో రాజకీయ హడావిడి

image

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఏప్రిల్‌లో పాలకవర్గాల గడువు ముగియనుండటంతో మార్చి 9 లోగా ఓటర్ల జాబితా పూర్తిచేయాలని అధికారులు ఆదేశించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 1000కి పైగా పంచాయతీల్లో అప్పుడే రాజకీయ సందడి మొదలైంది. రిజర్వేషన్ల కేటాయింపుపై పల్లెల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పోటీకి సిద్ధమయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు.