News September 21, 2024

‘ఇది మంచి ప్రభుత్వం’పై అవగాహన కల్పించండి: నెల్లూరు కమిషనర్

image

కలెక్టర్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ పరిధిలోని రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో అధికారులంతా చురుగ్గా పాల్గొని, 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూర్యతేజ తెలియజేసారు. “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంల్లో 26వ తేదీ వరకు ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు.

Similar News

News October 26, 2025

రేపు PGRS రద్దు: కలెక్టర్

image

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్‌ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 26, 2025

కందుకూరులో వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

కందుకూరులో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని కోవూరు రోడ్డులో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం పురుగు మందు తాగిన ఇద్దరిని కందుకూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఒకరు మరణించారని తెలిసింది. చికిత్స పొందుతూ మరొకరు కూడా మరణించారని సమాచారం. వృద్ధ దంపతుల ఆత్మహత్యకు కారణం ఏమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.

News October 26, 2025

నెల్లూరు: అంతా ఉరుపే.. తడిస్తే మాకేంటి..!

image

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వెనుక ఉండే పాత భవనంలో సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన మందులు, బ్లీచింగ్ తదితర వస్తువులు భద్రపరుస్తారు. అయితే ఆ భవనం పాతదై పడిపోయే స్థితిలో ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సైతం ఆ భవనం ఉరిసింది. దీంతో అక్కడ ఉన్న సామగ్రి తడిచిపోయింది. ఎంతో విలువైన వాటిని భద్రపరిచేందుకు అక్కడ STORE ROOM సైతం లేకపోవడం గమనర్హం. గతంలో ఎన్నో సార్లు ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.