News June 4, 2024

ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయం: ఎంపీ అరవింద్

image

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో తన విజయం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క నిజామాబాద్ మోదీ కుటుంబ సభ్యుల విజయమని ఎంపీ అరవింద్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్నికల కౌంటింగ్ హాల్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారన్నారు. తనపై నమ్మకంతో రెండోసారి గెలిపించిన ప్రజల ఆశలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.

Similar News

News November 28, 2025

NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

image

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్‌లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.

News November 28, 2025

NZB: రెండో రోజు 450 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచి స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

News November 28, 2025

NZB: పోలీసు సిబ్బందికి ఉలన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేత

image

చలికాలంలో విధుల నిర్వహణ కష్టమవుతోందని ముందు జాగ్రత్తగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్‌లోని ఏఆర్, సివిల్ పోలీస్ సిబ్బందికి ఉలెన్ బ్లాంకెట్స్, టీ షర్ట్స్ అందజేశారు. చలికాలంలో ప్రతి ఒక్కరూ ఉలెన్ బ్లాంకెట్స్ సద్వినియోగం చేసుకోవాలని, విధి నిర్వహణలో క్యారీ చేసి ఉపయోగించుకోవాలని సీపీ సూచించారు.