News December 26, 2024
ఇది సార్ వైజాగ్ బ్రాండ్..!

వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్లు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీ కారణంగా రాష్ట్రంలో తీర ప్రాంతాలన్నీ అల్లకల్లోలమైనా విశాఖలో బీచ్లు చెక్కుచెదరలేదు. రాకాసి అలలు కృష్టా జిల్లాలో 27, నెల్లూరులో 20, ప్రకాశంలో 35 మందిని బలితీసుకోగా.. విశాఖలో ఒక్క ప్రాణం కూడా పోలేదు. దీనికి కారణం ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధంగా సముద్రంలోకి చొచ్చుకొచ్చే కొండలు, డాల్ఫిన్స్ నోస్.
Similar News
News November 2, 2025
అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి: ఏసీబీ డీజీ

ప్రతి ఒక్కరు అవినీతికి వ్యతిరేకంగా పోరాడితేనే ఫలితం ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా పాత బస్టాండు స్టేడియం వద్ద భారీ ర్యాలీ ప్రారంభించారు. అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు 1064 నంబర్కు తెలియజేయాలని సమిష్టిగా పోరాడితే అవినీతి పారద్రోలవచ్చని అన్నారు. రాష్ట్ర ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News November 2, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు PGRS

విశాఖ కలెక్టరేట్లో ఈనెల 3న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News November 2, 2025
విశాఖలో కార్డన్ అండ్ సెర్చ్.. 9వాహనాలు సీజ్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శనివారం “కార్డన్ & సెర్చ్” ఆపరేషన్ నిర్వహించారు. ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో సరియైన ధృవపత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.


