News June 14, 2024

ఇదే పాఠశాలలో చదివి ఎమ్మెల్యే అయ్యాను: అనిల్ జాదవ్

image

నేరడిగొండ మండలం రాజురా పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేసి చాక్లెట్లను పంచారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.

Similar News

News December 9, 2025

ఆదిలాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, సిరికొండ, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు మండలాల్లోని 166 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

News December 8, 2025

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు: ADB కలెక్టర్

image

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం ఆదిలాబాద్ జెడ్పి సమావేశ మందిరంలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల స్టేజ్- 2 రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ పూర్తి చేసి ఫలితాలు T -పోల్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.

News December 7, 2025

ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

image

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.