News June 14, 2024

ఇదే పాఠశాలలో చదివి ఎమ్మెల్యే అయ్యాను: అనిల్ జాదవ్

image

నేరడిగొండ మండలం రాజురా పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేసి చాక్లెట్లను పంచారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.

Similar News

News September 20, 2024

మంచిర్యాల: పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి ఆత్మహత్య

image

పురుగు మందు తాగి మెప్మా ఉద్యోగి రమేష్(36) ఆత్మహత్య పాల్పడిన ఘటన హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన రమేశ్ మంచిర్యాలలో నివాసం అంటూ మెప్మాలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రమేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

News September 20, 2024

బోథ్: రూ.81 వేల ధర పలికిన గణేశ్‌ లడ్డూ

image

బోథ్ మండల కేంద్రంలోని చైతన్య యూత్ గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ను ఏర్పాటు చేశారు. నిత్యం భక్తిశ్రద్ధలతో వినాయకుడిని కొలిచారు. కాగా గురువారం రాత్రి లడ్డూ వేలం పాట నిర్వహించారు. హోరాహోరీగా సాగిన వేలంలో చివరగా రూ.81 వేలకు మండల కేంద్రానికి చెందిన ఇట్టెడి చిన్నారెడ్డి దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా మండలి కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీకాంత్, మహేందర్ ఉన్నారు.

News September 20, 2024

ADB: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు రిజిష్టర్, రికార్డులను పరిశీలించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.