News February 26, 2026

ఇద్దరి మృతి.. అండగా ఉంటా: ఇల్లందు ఎమ్మెల్యే

image

నిన్న జరిగిన ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. పోస్టుమార్టం ప్రక్రియపై డాక్టర్లతో, కేసు దర్యాప్తుపై సీఐతో మాట్లాడారు. ప్రమాదానికి కారకులైన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Similar News

News April 14, 2026

క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

image

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt

News April 14, 2026

VZM: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ భార్యాభర్తలు అరెస్ట్

image

ఒడిశా నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను VZM 1వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.5లక్షల విలువైన 49.147 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లు, రూ.650 స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ సోమవారం తెలిపారు. కర్ణాటకకు చెందిన భార్యాభర్తలు వరుణ్‌కుమార్ మణి, నిషా బైరపురంతో సహా మరో ఇద్దరు గూడ్స్ షెడ్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది.

News April 14, 2026

విశాఖ: దైవ దర్శనానికి వెళ్లి వస్తూ అనంత లోకాలకు

image

ఆనందపురంలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. గుడిలోవలోని శివాలయానికి వెళ్లి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడి ఆటో డ్రైవర్ బంక పైడి రాజు(25), ఓ ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని స్థానిక హాస్పిటల్‌కు తీసుకువెళ్తుండగా పైడి రాజు మృతిచెందారు. హార్ట్ అటాక్ రావడంతోనే చనిపోయారని వైద్యుల నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.