News January 21, 2025
ఇద్దరు ఐపీఎస్‌ల ప్రేమ వివాహం.. కర్నూలులో పోస్టింగ్..!

ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.
Similar News
News October 29, 2025
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్ విద్యార్థి

నవంబర్‌లో గుంటూరులో జరగబోయే రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-14 క్రికెట్ పోటీలకు ముజఫర్ నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్.షాకీర్ ఎంపికైనట్టు పాఠశాల హెడ్మాస్టర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సుదర్శన్ రావు, శేఖర్ మీడియాతో మాట్లాడారు. కర్నూలులో జరిగిన ఎంపిక పోటీల్లో తమ పాఠశాల విద్యార్థి ఉద్యమ ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్టు తెలిపారు.
News October 28, 2025
కర్నూలు: బస్సు ప్రమాదం కేసులో డ్రైవర్ అరెస్ట్.!

కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో 24వ తేదీన జరిగిన బస్సు ప్రమాదం కేసులో వి.కావేరీ ట్రావెల్స్ డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా పత్తికొండ DSP వెంకట్రామయ్య పర్యవేక్షణలో విచారణ జరిపి, నిందితుడిని మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు జిల్లా SP విక్రాంత్ పాటిల్ తెలిపారు.
News October 28, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.


