News April 10, 2024
ఇద్దరు పిల్లలతో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాసీమ కుటుంబకలహాలతో జీవితంపై విరక్తి చెంది తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు మైక్రో స్టేషన్ క్వారీకి వెళ్లింది. ఆమె భర్త షబ్బీర్ విషయం తెలుసుకుని జీఆర్పీ కానిస్టేబుల్ ఎండీ రషీద్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన రైల్వే కానిస్టేబుల్ ఘటనాస్థలికి చేరుకుని కాపాడాడు. ముగ్గురి ప్రాణాలను
కాపాడిన కానిస్టేబుల్‌ను స్థానికులు అభినందించారు.
Similar News
News January 5, 2026
ఆదిలాబాద్: నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు: కలెక్టర్

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయంలో ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్న నాగోబా జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. సోమవారం నాగోబా దేవాలయాన్ని కలెక్టర్, పీవో యువరాజ్ మర్మాట్ సందర్శించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు నాగోబా జాతరకు తరలివస్తారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 5, 2026
ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.
News January 5, 2026
తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.


