News March 11, 2025
ఇనాం భూముల సమస్యలు పరిష్కరించండి: గంటా

ఇనాం భూముల సమస్యలను పరిష్కరించాలని భీమిలి MLA గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో కోరారు. ఆ భూములపై యాజమన్య హక్కులు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా వారి ఆధీనంలో ఉన్నా సరే పిల్లల పెళ్లిళ్లకు, చదువులకు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకొని మధ్యే మార్గంగా సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుందన్నారు.
Similar News
News November 12, 2025
విశాఖ: ఈనె 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

విశాఖలో 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు.14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శన, 16న చిత్రలేఖనం,17న వకృత్వ పోటీలు,18న సభ్యత్వ సేకరణ, 19న ఇందిరాగాంధీ జయంతి, మ్యూజికల్ చైర్ పోటీలు, 20న గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు విజేతలకు బహుమతులు ఇవ్వనున్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు గ్రంథాలయ అధికారులు తెలిపారు.
News November 12, 2025
విశాఖ: ‘వాహనదారులు నిబంధనలు పాటించాలి’

ఆటోరిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, స్కూల్ పిల్లలను ఆరుగురుకి మించి తీసుకెళ్లకూడదని ఉప రవాణా కమీషనర్ ఆర్.సి.హెచ్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. CC బస్సులో, టూరిస్ట్ బస్సులలో అత్యవసర ద్వారానికి అడ్డంగా టైర్లు, లగేజిలు ఉంచకూడదన్నారు. విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్ జరుగనున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వాహనాలను నడపాలని సూచించారు.
News November 12, 2025
న్యుమోనియా లక్షణాలు ఇవే: DMHO

నేటి నుంచి ఫిబ్రవరి 28వరకు అన్ని ఆరోగ్య కేంద్రాలలో సాన్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు DMHO జగదీశ్వరరావు తెలిపారు. ఈ సాన్స్ ప్రోగ్రాం ద్వారా పిల్లలలో న్యుమోనియా లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రతలు, వైద్యం గూర్చి నిర్వహించనున్నారు. దగ్గు, జలుబు ఎక్కువ రావటం, అధిక జ్వరం, శ్వాస తీసుకొనే సమయంలో డొక్కలు ఎగురవేయటం లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.


