News August 11, 2024
ఇనుగుర్తి: విద్యుత్తుషాక్‌తో వ్యక్తి మృతి
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారంలో విషాదం చోటుచేసుకుంది. దర్శనం సోమయ్య (60) అనే వ్యక్తి పనుల నిమిత్తం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్ళగా కరెంటు షాక్ తగిలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సోమయ్యతో పాటు రెండు మూగజీవులు (కుక్క, కోతి) మృతిచెందాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 11, 2024
కాలం చెల్లిన వాహనాలను నడిపితే చర్యలు: ఏసీపీ
కాలం చెల్లిన వాహనాలను నడిపితే సంబంధిత వాహనదారులపై తగిన చర్యలు తీసుకుంటామని జనగామ ఏసీపీ పార్థసారధి వాహనదారులను హెచ్చరించారు. మంగళవారం రాత్రి నర్మెట్ట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డెన్ చర్చిలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 10, 2024
అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ ప్రాణాలు అర్పిస్తున్నారు: మంత్రి కొండా
దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే, సహజ వనరులైన అడవుల సంరక్షణకై పోరాటం చేస్తూ అటవీ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రేపు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల సంరక్షణకై ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ అటవీ సంపద సంరక్షణకు, వన్యప్రాణుల పరిరక్షణకు ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.
News September 10, 2024
పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు: కేటీఆర్
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారని, పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక, ఈ పోరాటానికి ప్రపంచ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం ఉందని కేటీఆర్ ఓ ప్రత్యేక ఫొటోను ట్వీట్ చేశారు.