News April 5, 2025
ఇన్‌కం సర్టిఫికెట్ అవసరం లేదు: ADB కలెక్టర్

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. ADB కలెక్టరేట్‌లో PO ఖుష్బూ గుప్తాతో కలిసి పథకంపై సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ద దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Similar News
News April 21, 2025
ADB: మృతదేహంపై కత్తిపోట్లు.. హత్యగా అనుమానం

భోరజ్ మండలం పెన్‌గంగా సమీపంలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మృతదేహం కనిపించడంతో గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శి ఆనంద్‌కు సమాచారం అందించారు. మృతుడి ముఖంపై, ఛాతి భాగంలో కత్తిపోట్లు ఉన్నాయన్నారు. మహరాష్ట్ర వాసిగా అనుమానిస్తున్నామని.. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉండవచ్చని వివరించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం అందించాలన్నారు.
News April 20, 2025
ADB ITI కళాశాలలో రేపు అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 21న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ అందజేస్తామన్నారు.
News April 20, 2025
ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III, V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.