News October 1, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. భీమవరం మహిళను మోసం చేసిన HYD వాసి

image

ప.గో జిల్లా భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ‌ను HYDకు చెందిన కృష్ణమోహన్ ఉద్యోగం పేరిట మోసం చేసినట్లు SI రెహమాన్ సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. సదరు మహిళ, కృష్ణమోహన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహితులయ్యారన్నారు. తన తమ్ముడికి ఉద్యోగం కావాలని ఆమె కోరగా.. అదే ఛాన్స్‌గా తీసుకొని కృష్ణమోహన్ విడతల వారీగా రూ.1,08,000 నగదు తీసుకున్నాడు. మోసపోయినట్లు తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Similar News

News October 1, 2024

వైసీపీలో తాడేపల్లిగూడెం నాయకుడికి కీలక బాధ్యతలు

image

వైసీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వడ్డీ రఘురాం నాయుడును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం తాడేపల్లిగూడెంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో రఘురాం నాయుడు ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

News October 1, 2024

వరద బాధితులకు భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ విరాళం

image

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం రూ.1,50,116 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని అభినందించారు.

News October 1, 2024

భీమవరంలో యువకుడి ఆత్మహత్య

image

భీమవరంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కె.మణికంఠ కుమార్(32) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మంగళవారం ఉదయం అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.