News March 15, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి

ఆదోనిలోని ఇంద్రనగర్‌కు చెందిన బాలు, గుత్తి మండలం కొత్తపేటకు చెందిన స్రవంతి ప్రేమించుకుని శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్నారు. రెండేళ్ల నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరైనా మనుషులంతా ఒక్కటేనని చాటిచెబుతూ.. పెద్దల సమక్షంలో ఆదోనిలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యారు.
Similar News
News April 20, 2025
కరీంనగర్: JEE మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య సత్తా

JEE మెయిన్స్-2025 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు M.రోహిత్ 17, T.కుందన్ 814, P.ఈశ్వర్ ముఖేష్ 1275, M. అంజలి 2575, B. అక్షర 2992, M. తరుణ్ 5949, G. నందిని 7464 ర్యాంకులు సాధించారు. 20వేల లోపు 15 మంది విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించగా.. పరీక్షకు హాజరైనవారిలో 40% మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లితండ్రులను చైర్మన్ రమేష్ రెడ్డి అభినందించారు.
News April 20, 2025
ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 21న(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ దృష్ట్యా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కావు,న జిల్లాకు చెందిన ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. వచ్చే సోమవారం యధావిధిగా ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు.
News April 20, 2025
గుజరాత్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్‌కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.