News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
Similar News
News March 13, 2025
బాపట్ల: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

బాపట్ల జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పక్కా గృహాల నిర్మాణం, స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.
News March 13, 2025
మెట్‌పల్లి: పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి: కలెక్టర్

ఇంటి పన్నులు చెల్లించి పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మెట్‌పల్లి, కోరుట్ల పట్టణంలో గురువారం పర్యటించిన ఆయన ఇంటి పన్ను వసూళ్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. అత్యధిక బకాయిలు ఉన్నవారికి నోటీసులు జారీ చేయాలని, అయినను చెల్లించని వారి ఆస్తులను పురపాలక సంఘ చట్టం ప్రకారం సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే హెల్త్ సబ్ సెంటర్ స్థలం సేకరణ పనులను పరిశీలించారు.
News March 13, 2025
శాసనసభ్యుల క్రీడల పోటీలకు సిద్ధం చేయండి: కమిషనర్

శాసనసభ్యుల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పోటీలకు స్టేడియంలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడలో గురువారం ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంను ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 20 వరకు జరిగే శాసనసభ్యుల క్రీడల పోటీలకు ఎటువంటి లోపం లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.