News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.
Similar News
News April 13, 2026
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో పెద్దపల్లి బాలికలు సత్తా

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా బాలికలు బాలుర కంటే 30.53 శాతం అధిక ఉత్తీర్ణతతో ఘనవిజయం సాధించారు. జిల్లాలో మొత్తం 2,412 మంది బాలికలకు గాను 1,682 (69.73%) మంది ఉత్తీర్ణులవ్వగా, బాలురు 1,704 మందిలో కేవలం 668 (39.20%) మంది మాత్రమే పాస్ అయ్యారు. విద్యా పోటీలో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 13, 2026
సంగారెడ్డి: బీటెక్ విద్యార్థి మృతి.. ఐదుగురికి పునర్జన్మ

తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశారు సంగారెడ్డి మం. కోత్లాపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ (21). బీటెక్ పూర్తి చేసిన ఉదయ్ ఈనెల 4న బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆ పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో ఉదయ్ అవయవాలు సేకరించి ఐదుగురు బాధితులకు అమర్చి పునర్జన్మ ప్రసాదించారు.
News April 13, 2026
‘వనజీవి’ రామయ్యకు దక్కని గౌరవం

కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ అందుకున్న ‘వనజీవి’ రామయ్య ప్రథమ వర్ధంతిని పాలకులు, అధికారులు విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బతికున్నప్పుడు ఫొటోల కోసం పోటీపడిన నేతలు, నేడు నివాళులర్పించేందుకు రాకపోవడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పర్యావరణం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడిని ఏడాదిలోనే మరచిపోవడం విచారకరమని ప్రజలు వాపోతున్నారు.


