News February 16, 2025

ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా కామారెడ్డి: కలెక్టర్

image

కామారెడ్డిని ఇన్ శానిటరీ లెట్రిన్ రహిత జిల్లాగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు తేలిందన్నారు. దీనిపై గత నెల 24వ తేదీన అభ్యంతరాలను కోరగా, ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

Similar News

News December 15, 2025

గంజాయి నిర్మూలనకు పక్కా ప్రణాళికలు: కలెక్టర్

image

జిల్లాలో గంజాయి రవాణా నిర్మూలనకు పక్కా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేయడం చాలా కష్టం అనే పరిస్థితిని తీసుకురావాలన్నారు. గ్రామాల్లో రైతులు ఏ పంటలు సాగు చేస్తున్నారు అనే దానిపై అవగాహన ఉండాలన్నారు.

News December 15, 2025

నల్గొండ జిల్లాలో ఈనాటి ముఖ్యాంశాలు

image

నల్లగొండ : మూడో విడత పోలింగ్ సిబ్బంది ర్యాండమేజేషన్
నల్గొండ: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ కార్యదర్శిగా సాత్విక
చిట్యాల : డంపింగ్ యార్డుతో ఇబ్బందులు
నాంపల్లి : చెరువు నిండా వ్యర్థాలే
అనుముల : సాఫ్ట్వేర్ టు సర్పంచ్
దేవరకొండ : ముగిసిన మూడో విడత ప్రచారం
నకిరేకల్ : సర్పంచులకు సమస్యల స్వాగతం
నల్లగొండ : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో?

News December 15, 2025

తాడేపల్లిగూడెం: 17, 18 తేదీల్లో PG, PHD కోర్సులకు కౌన్సిలింగ్

image

తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్‌డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరుగుతుందని, అర్జీదారులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.