News February 16, 2025
ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా కామారెడ్డి: కలెక్టర్

కామారెడ్డిని ఇన్ శానిటరీ లెట్రిన్ రహిత జిల్లాగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో గతంలో నిర్వహించిన సర్వే ప్రకారం.. మ్యానువల్ స్కావెంజర్లు లేనట్లు తేలిందన్నారు. దీనిపై గత నెల 24వ తేదీన అభ్యంతరాలను కోరగా, ఎలాంటి అభ్యంతరాలు రాలేదన్నారు. ఇన్ శానిటరీ లెట్రిన్ జిల్లాగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
Similar News
News March 20, 2025
నాగర్‌కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్‌లు విద్యార్థులతో కిక్కిరిశాయి.
News March 20, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

ఆసిఫాబాద్ జిల్లాలో మూడ్రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలగనుంది. పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతన్న ఆందోళన చెందుతున్నారు. రైతులు పంటలను సంరక్షించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
News March 20, 2025
ములుగు: బెట్టింగ్ యాప్‌లపై నిఘా: SP

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్‌లకు అలవాటు పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ములుగు ఎస్పీ శబరిశ్ సూచించారు. యాపుల్లో బెట్టింగుకు పాల్పడినా, గేమింగ్ ఆడినా, ప్రోత్సహించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బెట్టింగ్‌కు అలవాటు పడి, డబ్బులు కోల్పోయి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇలాంటి యాప్‌ల వల్ల ఆత్మహత్యలకు దారితీస్తుందన్నారు. జిల్లా ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.