News June 18, 2024

ఇప్పట్లో నిజామాబాద్ CP బదిలీ లేనట్లే.!

image

నిజామాబాద్ CP కల్మేశ్వర్ బదిలీపై ఊహాగానాలకు తెరపడింది. నిన్న జరిగిన IPSల బదిలీల్లో ఆయన పేరు లేకపోవడంతో ఇప్పట్లో ఆయన బదిలీ లేనట్లేనని స్పష్టత వచ్చింది. కల్మేశ్వర్ సతీమణి అయిన IPS అధికారిణి రోహిణీ ప్రియదర్శిని డిచ్పల్లి 7వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వస్తుండటంతో CP ట్రాన్స్ఫర్ వార్తలకు చెక్ పడింది. సీపీ కల్మేశ్వర్ బదిలీ అవుతారంటూ కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News October 31, 2025

నిజామాబాద్‌లో పోలీస్‌ల కొవ్వొత్తుల ర్యాలీ

image

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ సీపీ సాయిచైతన్య ఆధ్వర్యంలో పట్టణంలోని కోర్ట్ చౌరస్తా నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరువలేవని కొనియాడారు. వారి వల్లే సమాజంలో శాంతి నెలకొందన్నారు. పోలీస్ శాఖ ఎప్పుడు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందన్నారు.

News October 31, 2025

బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి రక్షించాలి: కవిత

image

చారిత్రాత్మక బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా బారి నుంచి రక్షించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కోరారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఆమె శుక్రవారం బొమ్మలమ్మగుట్టను సందర్శించారు. ఈ గుట్టపై గ్రానైట్ మాఫియా కన్నుపడిందన్నారు. సొంత ఖజానా నింపుకోవడానికి గుట్టను విధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం గుట్టను రక్షించుకోవాలన్నారు.

News October 31, 2025

NZB: కల్వల మత్తడి మరమ్మతులు వెంటనే చేపట్టాలి: కవిత

image

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి మరమ్మతులను వెంటనే చేపట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె శుక్రవారం సందర్శించారు. మత్తడి కొట్టుకుపోయి 3 ఏళ్లు అవుతోందన్నారు. మరమ్మతులకు గత ప్రభుత్వమే రూ.70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు బాగు చేయించలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందన్నారు.