News February 27, 2026
ఇప్పుడు టీమ్‌ఇండియా సెమీస్ చేరాలంటే..

T20 WC: జింబాబ్వేపై 72 రన్స్ తేడాతో గెలిచిన భారత్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. ప్రస్తుతం గ్రూప్-1లో సౌతాఫ్రికా సెమీస్ చేరింది. రెండో స్థానం కోసం ఇండియా, విండీస్ పోటీ పడుతున్నాయి. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్ సెమీస్‌కు వెళ్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్ వర్షంతో రద్దైనా లేదా ఇంకే కారణం వల్లైనా ఫలితం తేలకుండా పోయినా బెస్ట్ రన్ రేట్ ఉన్న వెస్టిండీస్ ముందుకెళ్తుంది.
Similar News
News April 19, 2026
విపక్షాలపై మోదీ ‘భ్రూణ హత్య’ అస్త్రం!

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని మోదీ ‘భ్రూణ హత్య’తో పోల్చడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ విమర్శల కంటే ఇలాంటి భావోద్వేగ పదాలు వాడటం వల్ల మహిళా ఓటర్లలోకి సందేశం బలంగా వెళ్తుందని BJP భావన. విపక్షాలు బిల్లును అడ్డుకోవడం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని పురిట్లోనే చంపేయడమేనని మోదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పదం రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
News April 19, 2026
2027లో అల్లు అర్జున్ ‘రాకా’?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న ‘రాకా’ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. షూటింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో ఈ సినిమా 2027లో రాదనే వార్తలు వినిపించాయి. అయితే ఆ రూమర్స్‌లో నిజం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది చివరికల్లా బన్నీ తన షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తారట. భారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉన్నప్పటికీ 2027 సెకండాఫ్‌లోనే మూవీని రిలీజ్ చేసేలా అట్లీ ప్లాన్ చేస్తున్నారని టాక్.
News April 19, 2026
59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారు.. మోదీపై ఖర్గే ఫైర్

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రసంగంలో ప్రధాని 59 సార్లు కాంగ్రెస్ పేరెత్తారని, మహిళల గురించి మాత్రం తక్కువగా మాట్లాడారని విమర్శించారు. మోదీ ప్రాధాన్యం మహిళలు కాదని, కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా అధికారిక వేదికను రాజకీయ విమర్శలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఆరోపించారు.


