News March 28, 2025
ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాపట్ల జిల్లా కలెక్టర్

మతసామరస్యానికి ప్రతీక ముస్లిం మతం అని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అన్నారు. గురువారం సాయంత్రం బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
Similar News
News February 24, 2026
కురుపాం: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

కురుపాం మండలం తోటగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణరావు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల మేరకు.. నిత్యం జీలుగు కళ్ళు తాగి తిరుగుతుండడంతో తండ్రి మందలించాడు. దాంతో మనస్తాపం చెంది ఈనెల 22న సాయంత్రం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కురుపాం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో విజయనగరం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించాడు.
News February 24, 2026
ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జనగామ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణపై కలెక్టరేట్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు, తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 24, 2026
జమ్మికుంట: నిలకడగానే పత్తి గరిష్ట ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో మంగళవారం పత్తి ధరలు సోమవారం లాగే నిలకడగా కొనసాగాయి. మంగళవారం మార్కెట్‌కు 42 వాహనాల్లో 293 క్వింటాళ్ల దిగుబడి రాగా.. గరిష్ఠంగా రూ.7,550, కనిష్టంగా రూ.6,200 పత్తి ధర పలికింది. మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాజా, అధికారులు లావాదేవీలను పర్యవేక్షించారు. నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.


