News March 6, 2025

ఇఫ్లూ వీసీగా ప్రొఫెసర్ నాగరాజు

image

ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొ.నాగలపల్లి నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని గంగాధర్ మెహర్ యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అధ్యాపకుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు.

Similar News

News March 19, 2025

HYD: మంత్రి సీతక్క పేరుతో నకిలీ MLA స్టిక్కర్‌

image

హైదరాబాద్‌ నకిలీ MLA స్టిక్కర్ వేసుకొని సంచరిస్తున్నారు. తాజాగా మంత్రి సీతక్క పేరుతో ఉన్న నకిలీ స్టిక్కర్ వాహనం (TG 09 HT R 1991)THARపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. మంత్రి పీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కార్ సీజ్ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

ముకుంద జువెలర్స్ వార్షికోత్సవ వేడుకలు

image

ముకుంద జువెలర్స్ కూకట్‌పల్లి బ్రాంచ్ 2వ వార్షికోత్సవం, కొత్తపేట బ్రాంచ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు సంవత్సరాల్లోనే 6 బ్రాంచులు స్థాపించడం సంతోషంగా ఉందని, కస్టమర్ల నమ్మకమే తమ సంస్థ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. సేల్స్ పెంచిన ఉద్యోగులకు కార్లు, బైకులు, టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా అందజేశారు.

News March 19, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

image

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు.

error: Content is protected !!