News December 1, 2024
ఇబ్బందులు ఉన్నాయా.. కాల్ చేయండి: కోనసీమ కలెక్టర్

కోనసీమ జిల్లాలోని ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా తమకు తెలియజేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న రైతులు 94416 92275, 83094 32487 నంబర్లకు ఫోన్ చేసి వారి సమస్యలను తెలియజేయవచ్చని అన్నారు.
Similar News
News October 13, 2025
రాజమండ్రిలో యువ హీరో సందడి

అన్ని హంగులతో కూడిన వినోదాత్మక చిత్రంగా ‘కె – ర్యాంప్’ రూపొందిందని హీరో కిరణ్ అబ్బవరం తెలిపారు. సినిమా ప్రమోషన్ నిమిత్తం ఆయన సోమవారం రాజమండ్రి వచ్చారు. జైన్స్ నాని దర్శకత్వంలో, హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం దీపావళి రోజున విడుదల కానుందని చెప్పారు. సినిమా ఆద్యంతం వేగంగా, స్పీడుగా నడుస్తుందనే ఉద్దేశంతోనే ‘ర్యాంప్’ అనే పేరు పెట్టామని కిరణ్ అబ్బవరం పేర్కొన్నారు.
News October 13, 2025
జీఎస్టీ 2.0 తో ప్రజలకు ఊరట: కలెక్టర్

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సోమవారం వై జంక్షన్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు కలెక్టర్ కీర్తి చేకూరి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. జీఎస్టీ 2.0 అమలుతో ప్రజలకు ఊరట లభిస్తోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తెచ్చిందని వివరించారు.
News October 13, 2025
ఇండియన్ రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వాయిదా

ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తూ.గో. జిల్లా శాఖ నూతన మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు విషయమై ఈ నెల 15న ఉదయం 11 గంటలకు జరగవలసిన సమావేశం వాయిదా పడిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం తెలిపారు. ఉమ్మడి తూ.గో. జిల్లా కాకినాడ నుంచి జాబితా ఇంకా అందకపోవడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. తదుపరి సమావేశపు తేదీని త్వరలో ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు.