News March 15, 2025
ఇబ్రహంపట్నంలో దారుణ హత్య.. నిందితులు అరెస్ట్

ఇబ్రహంపట్నం ఫెర్రీలో శనివారం యువకుడు దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హతుడు కంచికచర్ల చెందిన వ్యక్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ GGHకు తరలించారు. నిందితులను అదుపులోకి తీసునన్నమన్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
News October 17, 2025
మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

మామునూర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణపై కలెక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష అని అన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న రెండో రాజధానిగా వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కీలకం అని తెలిపారు.
News October 17, 2025
కర్నూలులో ప్రధాని సభ విజయవంతం: సీఎం

కర్నూలులో ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభ విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, ఉన్నతాధికారులు, కర్నూలు-నంద్యాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్ర పర్యటనలో పాల్గొన్నారని, కర్నూలు సభ గొప్ప విజయం సాధించింది అని సీఎం అన్నారు.