News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం

HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 15, 2025
HYD: 17న KCRపై స్పెషల్ సీడీ: తలసాని

ఈనెల 17న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో కేక్‌కట్ చేసిన అనంతరం కేసీఆర్ జీవిత విశేషాలతో ప్రత్యేక సీడీ విడుదల చేస్తామన్నారు.
News February 15, 2025
రంగారెడ్డి: అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

రంగారెడ్డి కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ నారాయణ రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
News February 15, 2025
HYD: అవినీతికి పాల్పడితే కాల్ చేయండి: ACB

గచ్చిబౌలి ఏడీఈ సతీష్ లంచం తీసుకుంటూ ఇటీవల ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అవినీతికి పాల్పడితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని సూచించారు. లేదా వాట్సప్ నంబర్ 9440446106కు సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.