News December 9, 2024
ఇబ్రహీంపట్నంలో మృతదేహం కలకలం
ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ స్టేజ్ 1 గేట్ వద్ద సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. మృతుడు 5’5”అడుగుల ఎత్తు ఉండి సుమారు 50 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతుడు బిస్కెట్ కలర్ చొక్కా ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
Similar News
News January 18, 2025
ఆ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు లేదు: SP
కృష్ణా జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు హాజరవ్వాల్సిన పురుష అభ్యర్థులకు SP ఆర్. గంగాధర్ కీలక సూచన చేశారు. పురుష అభ్యర్థులకు మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో దేహదారుఢ్య పరీక్షలు ఈనెల 20 వరకు మాత్రమే నిర్వహిస్తామన్నారు. పురుషులకు సంబంధించి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి పొడిగింపులకు అవకాశం లేదని, కానిస్టేబుల్ అభ్యర్థులు గమనించాలని SP ఆర్. గంగాధర్ తెలిపారు.
News January 17, 2025
హెల్మెట్ వినియోగం తప్పనిసరి: కలెక్టర్
జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై కమిటీ సమీక్షించింది.
News January 17, 2025
VJA: అమిత్‌షా భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేయాలి
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన సందర్భంగా భద్రత ఏర్పాట్లపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు శుక్రవారం ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18, 19న జిల్లాలో కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ఆదేశించారు. సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.