News March 18, 2025

ఇబ్రహీంపట్నంలో సంచలనంగా మారిన వరుస మరణాలు

image

ఇబ్రహీంపట్నంలో వరుస మరణాలు జరుగుతున్నాయి. ఇద్దరూ వీటీపీఎస్ కాలువలో పడి మృతి చెందగా, ఒకరు కృష్ణానదిలో పడి మృతి చెందారు. మరో వ్యక్తి హత్యకి గురి అయ్యారు. మరొక రోజు ఒకరూ ఆత్మహత్య చేసుకోగా, ఒకరు హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం కృష్ణానదిలో ఒక మృత దేహం లభ్యం కాగా, సోమవారం మరో మృత దేహం వీటీపీఎస్ కాలువలో లభ్యమైంది. ఈ ఘటనలతో ఇబ్రహీంపట్నంలో ఈ వరుస మరణాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Similar News

News March 18, 2025

నల్గొండ: పనుల ప్రారంభం వేగవంతం చేయాలి:  కలెక్టర్ 

image

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో నల్గొండ బైపాస్ జాతీయ రహదారి 565కు సంబంధించి అవార్డు పాస్ చేయడం, పనుల ప్రారంభం వంటివి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె తన ఛాంబర్‌లో నేషనల్ హైవే 565 నల్గొండ బైపాస్‌పై జాతీయ రహదారుల సంస్థ అధికారులు ,ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం అయ్యారు. 

News March 18, 2025

NTR: ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాలపై ప్ర‌త్యేక దృష్టి: కలెక్టర్ 

image

అర్హులైన వారికి ఇబ్బంది లేకుండా ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీకి అధికారులు ప‌నిచేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో అట‌వీ శాఖ స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది. ఆర్‌వోఎఫ్ఆర్ ప‌ట్టాల పంపిణీ, హ‌రిత విస్తీర్ణం పెంపు, ఆక్ర‌మ‌ణ‌ల నియంత్ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై స‌మావేశంలో చ‌ర్చించారు. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప‌క‌డ్బందీగా అమ‌ల‌య్యేలా చూడాల‌న్నారు.

News March 18, 2025

చిత్తూరులో భారీగా పోలీసుల బదిలీ

image

చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. పోలీస్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా.. మరికొందరిని వీఆర్‌కు పంపించారు. పుంగనూరులో టీడీపీ నాయకుడి హత్య నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులను బదిలీ చేసినట్లు సమాచారం.

error: Content is protected !!